Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అఖిలభారత మత్స్యకారులు మత్స్యకార్మిక సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్డబ్ల్యూఎఫ్) కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన లెల్లెల బాలకృష్ణ తిరిగి ఎన్నికయ్యారు. కేంద్ర కమిటీలోకి గోరెంకల నర్సింహాను తీసుకున్నట్టుగా లెల్లెల బాలకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధ, గురువారాల్లో కలకత్తాలో సమాఖ్య జాతీయ మూడో మహాసభలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ సభలకు తెలంగాణ నుంచి ముఠా విజరుకుమార్, మునిగెల రమేష్, తేలు ఇస్తారి, ఎ శ్రీరాములు, శీలం శ్రీను, మామిండ్ల జగదీష్, విమల, పుష్ప ప్రతినిధులుగా హాజరయ్యారని తెలిపారు. సీఐటీయూ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో జరిగిన ఈ సభల్లో వారు మాట్లాడుతూ సముద్రం, మైదాన ప్రాంతాల్లో మత్స్య వృత్తిలోకి కార్పొరేట్ దురాక్రమణలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాల వల్ల మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటున్నదని విమర్శించారు.