Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు ఎల్సీజీటీఏ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వేసవి సెలవుల్లోనే పాఠశాల విద్యాశాఖలో లోకల్ క్యాడర్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు అన్ని క్యాడర్లలో పదోన్నతులు కల్పించాలని లోకల్ క్యాడర్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం (ఎల్సీజీటీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం వీరాచారి, నాయకులు ఎ లక్ష్మి, ఎం పద్మ, కె శ్యామల, మదనాల నళిని లేఖ రాశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో లోకల్ క్యాడర్ ఉద్యోగులకు 2021, జనవరిలో పదోన్నతులు కల్పించారని గుర్తు చేశారు. కేవలం విద్యాశాఖలోనే పదోన్నతులు ఇవ్వలేదని తెలిపారు. ఏకీకృత సర్వీసు రూల్స్ చెల్లవంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 2015, సెప్టెంబర్ 30 సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. దాని ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు అన్ని క్యాడర్లలో పదోన్నతులు ఇవ్వడానికి అడ్డంకుల్లేవని పేర్కొన్నారు.