Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్ల సంఘం గురువారం రాష్ట్ర కమిటీ ఎన్నికైంది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్ తిరిగి ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా కోడి మహేష్ కుమార్, కోశాధికారిగా బండి కృష్ణ, ముఖ్య సలహాదారులుగా టిగ్లా అధ్యక్షులు ఎం జంగయ్య, ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణగౌడ్ కొనసాగుతారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్, భాస్కర్ మాట్లాడుతూ గెస్ట్ లెక్చరర్ల సమస్య పరిష్కారం కోసం క్రియాశీలంగా పనిచేస్తామన్నారు. కన్సాలిడేట్ పే, ఆటో రెన్యూవల్ సాధనలో నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు.