Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని ట్రు టీచర్స్ కోయలేషన్ (టీటీసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని గురువారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పాపగారి ఆశీర్వాదం, కులేరి ప్రేమ్‌సాగర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో విద్యారంగంలో నెలకొన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలలకూ వర్తింపచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీసీ కోశాధికారి తొంట కృష్ణ, నాయకులు లింగస్వామి, ప్రభాకర్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.