Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : ఒక వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఏరుపల్లి మండలం గిర్దావర్ షేక్ యాకుబ్ అలీ, సర్వేయర్ శేషయ్యలు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డారు. ఏసీబీ డీజీ అంజనీ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏరుపల్లి మండలానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి భూమిలో చెట్టు కొట్టే విషయంపై అధికారికంగా సహకరించడానికి గానూ యాకూబ్ అలీ రూ. 7 వేలను, శేషయ్య రూ. 3 వేలను డిమాండ్ చేశారు. ఈ డబ్బులను తీసుకుంటుండ గా కాపు కాసిన ఏసీబీ అధికారులు గిర్దావర్, సర్వేయర్లను ఏక కాలంలో పట్టుకున్నారు. వీరి నుంచి లంచం సొమ్మును స్వాధీనపర్చుకొని హైదరాబాద్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి చంచల్గూడ జైలుకు తరలించారు.