Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూనియర్ లైన్‌మన్ పోస్టుల భర్తీ కోసం 2019లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం తదుపరి ప్రక్రియ పూర్తి చేసేందుకు తెలంగాణ టీఎస్పీడీసీఎల్కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. 2006లో ఇచ్చిన నోటిఫికేషన్లో అర్హత ఉన్న వాళ్లను భర్తీ చేయాలన్న సింగిల్ జడ్జి ఆర్డర్‌ను రద్దు చేసింది. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకమనీ, అందుకే సింగిల్ జడ్జి ఆర్డర్‌ను రద్దు చేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ సారధ్యంలోని డివిజన్‌బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని టీఎస్పీడీసీఎల్ వేసిన అప్పీల్‌ను అనుమతిస్తూ గురువారం తుది ఉత్తర్వులను వెలువరించింది.