Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లారీల కొరత తీర్చాలి
- నందిపేట్ మండలం వెల్మల్ క్రాస్‌రోడ్డు వద్ద రైతుల రాస్తారోకో
నవతెలంగాణ-నందిపేట్
వర్షం వచ్చేలా ఉంది.. వాతావరణంలో మార్పు ఉంది.. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించండి.. అంటూ రైతులు నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని వెల్మల్ క్రాస్ రోడ్డు వద్ద గురువారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా అన్నదాతలు మాట్లాడుతూ.. వరి కోతలు మొదలై నెల రోజులు కావస్తున్నా కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తూకం వేసి పది రోజులవుతున్నా ధాన్యం కల్లాల్లోనే ఉందని.. వర్షం వస్తే పూర్తిగా తడుస్తదని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 30 వేల వరకు ధాన్యం సంచులు కల్లాల్లో, రోడ్లపైనే ఉన్నాయన్నారు. కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లారీల కొరత తీవ్రంగా ఉందని, వెంటనే లారీలను తెప్పించి ధాన్యం బస్తాలను తరలించాలని కోరారు. ఈ విషయాన్ని సొసైటీ చైర్మెన్, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. తహసీల్దార్ అనిల్ కుమార్ జిల్లా పౌర సరఫరాల అధికారితో ఫోన్లో మాట్లాడి లారీల కొరత తీర్చుతామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.