Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సందర్శకులకు ఉచిత ప్రవేశం: మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సాలార్ జంగ్ మ్యూజియంలో ఈ నెల 16 నుంచి 21 వరకు అంతర్జాతీయ మ్యూజియాల వారోత్సవాలు జరగనున్నాయనిసాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని నిర్వహిస్తున్నదని తెలిపారు. ''మ్యూజియంల ప్రాధాన్యత'' అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్నినిర్వహిస్తామని పేర్కొన్నారు. మ్యూజియాలు కేవలం సాంస్కృతిక వారసత్వ ప్రదర్శనశాలలు మాత్రమే కాదని తెలిపారు. గత చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై సందర్శకులకు విజ్ఞానం అందించే విద్యా కేంద్రాలుగా అవి పనిచేస్తాయని పేర్కొన్నారు.