Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్
నవతెలంగాణ- కొల్లాపూర్
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మా నాయక్ డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజనులకు 6శాతం రిజర్వేషన్ ఉండే దన్నారు. కానీ, కేసీఆర్ అధికారంలో కొచ్చాక నిర్వహించిన ఇంటింటి సమగ్ర సర్వేలో గిరిజనుల జనాభా 9.9శాతం ఉన్నట్టు తేలిందని చెప్పారు. జనాభా దామాషా పద్ధతిన 10 శాతం రిజర్వే షన్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్రంలో గిరిజనుల రిజర్వే షన్ పెంచకపోవడం వల్ల ఐఐటీ, ఎన్ఐటీ, మెడికల్, ఇంజనీరింగ్ ఉద్యోగ అవకాశాలు నష్టం వాటిల్లిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో తీసుకు రావాలని డిమాండ్ చేశారు. ఆ జీవో ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 9 షెడ్యూల్లో చేర్చి చట్టం చేయాలని కోరారు. గిరిజన యువతకు రిజర్వేషన్ పట్ల అవగాహన కల్పించి గ్రామ గ్రామాన చైతన్యం చేసి పోరాటం నిర్వ హిస్తామని చెప్పారు. దీక్షలో కూర్చున్న వారికి వనపర్తి జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు అర్జున్ నాయక్, లక్ష్మణ్ నాయక్, శ్రీధర్ నాయక్, ప్రవీణ్ నాయక్, శంకర్ నాయక్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేశ్య నాయక్, శంకర్ నాయక్, వనపర్తి జిల్లా కార్యదర్శి బాల్య నాయక్, మాజీ జడ్పీటీసీ హనుమంత్, స్వెరోష్ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ కుమార్, తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు కృష్ణా నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.