Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్ద సవాలు: మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వారికి పోషకాహార భద్రత కల్పించడం పెద్ద సవాలుగా మారిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా ఆహార ధాన్యాలకు డిమాండ్ పెరుగుతున్నదన్నారు. అందుకే పంటల ఉత్పత్తి, ఉత్పాదకతను మెరుగుపరచడంలో నాణ్యమైన విత్తనం కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న 33వ ఇస్టా విత్తన కాంగ్రెస్ సదస్సులో మంత్రి మాట్లాడారు. విత్తన నాణ్యత పరీక్ష వ్యవస్థను అభివద్ధి చేయడంలో ఇప్పటికీ ప్రారంభ దశలో ఉన్న అభివద్ధి చెందుతున్న దేశాల కోసం విత్తన నాణ్యత పరీక్ష వ్యవస్థను అభివద్ధి చేయవలసిన అవసరమున్నదని చెప్పారు
ఇస్టా అధ్యక్షుడిగా డాక్టర్ కేశవులు ఎన్నిక
2022-25 కాలానికి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ కేశువులు...అంతర్జాతీయ ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికయారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి అభినందించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడం, విత్తన పరిశ్రమలకు మద్దతునిచ్చే ఇస్టా వారసత్వాన్ని కొనసాగించడమనేది పెద్దగా బాధ్యత అని కొనియాడారు.