Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ అండమాన్ సముద్రం, ఆగేయబంగాళాఖాతంలోకి ప్రవేశం
- రాబోయే 3 రోజుల పాటు వర్ష సూచన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నైరుతి రుతుపవనాలు ఈ నెల 15వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతున్న అసని తుపాన్ బలహీనపడి వాయుగుండంగా, ఆ తర్వాత అల్పపీడనంగా మారిందనీ, ఆ తుపాన్ మధ్య ట్రోపోస్పియర్ స్థాయిల వరకు విస్తరించియుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గురువారం ఒక డిగ్రీ నుంచి నాలుగు డిగ్రీల మేర పెరిగాయని పేర్కొన్నారు. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కూడా పడొచ్చని వివరించారు. బోరజ్, చాప్రాల(ఆదిలాబాద్)లో అత్యధికంగా 42.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. టీఎస్డీపీఎస్ నివేదిక ప్రకారం గురువారం రాష్ట్రంలో కేవలం నాలుగు ప్రాంతాల్లోనే వర్షపాతం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్లో రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల లోపే నమోదయ్యాయి. అయితే, కాస్త ఉబ్బరం మాత్రం ఉంది.