Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్లను అభినందించిన సూపరింటెండెంట్ శంకర్
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
ప్రమాదంలో శ్వాస నాళం దెబ్బతిన్న బాలుడికి అరుదైన చికిత్సచేసి ప్రశంసలందుకున్నారు కోఠి ఈఎన్టీ ఆస్పత్రి డాక్టర్లు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ గ్రామానికి చెందిన సూఫియాన్(10) ఆరేండ్ల కిందట ఒక దుర్ఘటనలో తలకు బలమైన గాయం తగిలి స్పృహ కోల్పోవడంతోపాటు అతని శ్వాసనాళం దెబ్బతిన్నది. నెలరోజులపాటు మాట రాలేదు. దీంతో బాలున్ని కుటుంబీకులు కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రికి తీసుకురావడంతో డాక్టర్ సంపత్ కుమార్ నేతృత్వంలోని డాక్టర్ల బృందంగురువారం సూఫియాన్‌కు శస్త్ర చికిత్స చేసి ఒక రంధ్రం (ట్రాకీయాష్టమి) ద్వారా శ్వాసను తీసుకునే వెసులుబాటు కల్పించారు. శ్వాసనాళాల గొట్టాన్ని సరిచేసి స్వయంగా శ్వాస తీసుకునేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం సఫలీకృతం అయింది. ఈ అరుదైన శస్త్రచికిత్స చేసిన వైద్యులు డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ హమీద్, డాక్టర్ మహేశ్వర్‌రెడ్డి, డాక్టర్ దుర్గాప్రసాద్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.శంకర్ అభినందించారు.