Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావుకు టీటీజీడీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) ఉస్మానియా యూనిట్ -1 కోరింది. ఈ మేరకు ఆ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ప్రతిభ లక్ష్మి నేతత్వంలో నాయకులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావుకు వినతిపత్రం సమర్పించారు. రోగులకు సేవలందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనీ, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు క్రమం తప్పకుండా నిర్వహించాల్సిన బోధనా కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. పెండింగ్ పీఆర్సీ బకాయిలు, యూజీసీ స్కేల్స్ మంజూరు చేసి అంకితభావంతో పని చేస్తున్న ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్లను ప్రోత్సహించాలని కోరారు. ఆరోగ్య తెలంగాణ కోసం తామంతా అంకితమై విధులు నిర్వహిస్తున్నామనీ, తమ కనీస అవసరాలను తీర్చడం ద్వారా పేద రోగులకు మరింత మెరుగైన సేవలు అందంచేందుకు తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేశారు.