Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అప్పుల ఊబిలోకి రాష్ట్రం కూరుకుపోయిందనీ, కేంద్రం ఇచ్చే నిధులన్నింటినీ రాష్ట్ర సర్కారు పక్కదోవ పట్టిస్తున్నదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె.లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్ర సర్కారు అధిక గ్రాంట్లు ఆశించడం, కేంద్రంపై ఆరోపణలు చేయడం పరిపాటు అయిందని విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామిక పాలన, డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశమిస్తే కుటుంబ, అవినీతి రహిత పాలన అందిస్తామని హామీనిచ్చారు. ప్రజా సంక్షేమ పథకాలు దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజలకే అందేలా కేంద్రం కృషి చేస్తున్నదన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. మోడీ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నదని ఆరోపించారు. ప్రజాసంగ్రామయాత్ర-2 బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయని చెప్పారు. సబితా ఇంద్రారెడ్డి పాలమూరులో పాదయాత్ర చేస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయన్నారు.