Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్గనైజేషన్ అభివృద్ధి,శిక్షణ కమిటీ కన్వీనర్‌గా డాక్టర్ సుధాకర్ :ఇందిరాశోభన్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరా శోభన్ చెప్పారు. పార్టీ ఆర్గనైజేషన్ అభివృద్ధి, శిక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా డాక్టర్ దిడ్డి సుధాకర్‌ను నియమించినట్టు శుక్రవారం ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమించామని తెలిపారు. రాబోయే కాలంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.