Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఛత్తీస్‌గడ్‌లో కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయడం పట్ల సీపీఎస్‌టీఈఏ అధ్యక్షులు దాముక కమలాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. రాష్ట్రంలోనూ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ పథకం (ఓపీఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్‌గడ్‌లోని ఉద్యోగులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 309కి సంబంధించిన నిబంధన ద్వారా గవర్నర్ గెజిట్ విడుదల చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 2004, నవంబర్ ఒకటో తేదీ నుంచి సీపీఎస్ అమల్లోకి వచ్చిందని తెలిపారు.అప్పటి నుంచి ఓపీఎస్ అమలు చేయాలంటూ ఉద్యోగులు,ఉపాధ్యాయులు అనేక ఉద్యమాలు చేస్తూనే ఉన్నారని వివరించారు.ఛత్తీస్గడ్,రాజస్థాన్ తరహాలో తెలంగాణలోనూ సీపీఎస్‌ను రద్దు చేసి,ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు.త్వరలోనే సీపీఎస్ ఉద్యోగు ల సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.