Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభకు ధన్వాడ రైతు పోటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం మహబూబ్నగర్ జిల్లా ధన్వాడలో రాష్ట్ర ప్రభుత్వం రెండువేల ఎకరాలను సేకరిస్తున్న నేపథ్యంలో అందుకు నిరసనగా రైతు చిన్నమాసయ్య రాజ్యసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.శుక్రవారం ఈమేరకు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఈ సందర్భంగా మసయ్య మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాసగౌడ్ తమ భూములను బలవంతంగా గుజ్జుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణను వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ వేసినట్టు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం భూసేకరణ ఆపడం లేదన్నారు. తమను చంపి మా భూములను తీసుకోవాలని కోరారు.దళితులకు అన్యాయాన్ని, భూసమస్యను ప్రపంచానికి తెలియజేసేందుకే తాను రాజ్యసభకు పోటీ చేస్తున్నట్టు తెలిపారు.