Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జేపీ దర్గా అభివృద్ధి,విస్తరణ విషయమై షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం హైదరాబాద్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గాను విస్తరించటంతో పాటు అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దర్గా వద్దనున్న నాలుగెకరాల భూమిని సేకరించే విషయమై అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధిలో భాగంగా బైపాస్ రోడ్డు, బస్టాండు,రోడ్ల విస్తరణ, మూత్రశాలలు,అతిథి గృహం నిర్మాణాలతో పాటు భక్తులకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు అధికారులు మంత్రికి తెలిపారు. సమావేశంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్ నదీమ్, వక్ఫ్ బోర్డు చైర్మెన్ మషీవుల్లా,సిఇవో షానవాజ్ ఖాసీం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయకుమార్ తదితరులు పాల్గొన్నారు.