Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎనిమిదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం యోగోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా యోగా ప్రాధాన్యతను తెలియజేసేలా 'రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో' ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కేంద్రీయసదన్లో యోగా ప్రాముఖ్యతపై ఏర్పాటు చేసిన చాయాచిత్ర ప్రదర్శన ఆదివారం వరకు కొనసాగుతుంది. 'యోగా విశిష్టత, ఆయుష్ ప్రాముఖ్యత, నిత్యజీవితంలో యోగా అవసరం' పై పత్రికా సమాచార కార్యాలయం వెబినార్‌ను కూడా నిర్వహించింది. ఆరోగ్యంగా ఉండడమే కాకుండా భావితరాలకు యోగా ప్రాధాన్యతను తెలియజేసేలా చాయాచిత్ర ప్రదర్శన ఉందనిచీఫ్ ఇంజనీర్ ఎన్.ఎన్.ఎస్.ఎస్.రావు తెలిపారు. రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో డైరెక్టర్ శతి పాటిల్మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం-2022, 75 రోజుల కౌంట్‌డౌన్ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యోగోత్సవ్ ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యోగాను మన దైనందిన జీవితం లో భాగంగా చేసుకోవాలని కోరారు.