Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగామ బ్యూరో - హైదరాబాద్
నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రి గైనకాలజీ విభాగం జూనియర్ రెసిడెంట్ డాక్టర్ గుర్రం శ్వేత అకాల మరణం పట్ల తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టిజుడా) తీవ్ర సంతాపాన్ని తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సాగర్, డాక్టర్ కార్తీక్, జాయింట్ ప్రెసిడెంట్ డాక్టర్ వివేక్ ఒక ప్రకటన విడుదల చేశారు. డాక్టర్ శ్వేత ప్రతి ఒక్కరి పట్లా ప్రతి ఒక్కరి విషయంలో ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరించేవారని గుర్తు చేసుకున్నారు. ఆమె స్థానం భర్తీ చేయలేనిదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.