Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరీంనగర్‌కు పట్టణ ప్రగతి పురస్కారం
- మంత్రులు కేటీఆర్, గంగుల అభినందనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రెవెన్యూలో సూర్యాపేట మున్సిపాల్టీ రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది. లక్షలోపు జనాభా ఉండే పురపాలికల్లో అధిక ఆదాయాన్ని ఆర్జించిన మున్సిపాల్టీగా అది రికార్డు సృష్టించింది. దీంతోపాటు పట్టణ ప్రగతి పురస్కారానికి కరీంనగర్ నగర పాలక సంస్థ ఎంపికైంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మున్సిపల్ చైర్మెన్లు, కమిషనర్ల సమావేశంలో ఈ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్... సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, కమిషనర్ రామాంజల్రెడ్డికి పురస్కారాన్ని అందజేశారు. వారిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. మరోవైపు కరీంనగర్ కార్పొరేషన్‌ను పురోభివృద్ధిలో నడిపించటం ద్వారా ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్న మేయర్ సునీల్‌రావును బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు.