Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మానసిక సమస్యలను సైతం పారద్రోలే శక్తి సంగీతానికి ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎమ్సీఆర్ హెచ్ఆర్డీ)లో గాన గంధర్వుడు ఘంటసాల శతజయంతి ఉత్సవాలను నిర్వహిం చారు. కిన్నెర ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకయ్య ముఖ్య అతిథిగా మాట్లాడుతూ... భాషను, సంస్కృతిని, కళలను ప్రోత్సహించటం ద్వారా వాటిని పరిరక్షించుకోవాలని అన్నారు. సమాజానికి కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని కూడా అందించేందుకు సంగీతమే సరైన సాధనమని తెలిపారు. తెలుగు సినిమా పాటకు ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రమణ్యం... ఇద్దరూ స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని స్మరించుకున్నారు. ఘంటసాల పేరిట ఏర్పాటు చేసిన అవార్డును ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు మనో (నాగూర్ బాబు)కు ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అందజేశారు.