Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'నువ్వెన్ని లీగల్ నోటీసులిచ్చినా భయపడే ప్రసక్తే లేదు. నీకు నిజంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థతో సంబంధం లేకుంటే..ఈ వ్యవహారంలో ఐటీ శాఖ తప్పులేదని భావిస్తే..వెంటనే సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రారు' అని మంత్రి కేటీఆర్కు బండి సంజరు సవాల్ విసిరారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గంలోని సిరిగిరిపురం హెచ్ఎండీఏ పార్కు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. 'నీ సంగతి అంతా తెలుసు. మీకు యూఏఈలో ఉన్న బీఆర్శెట్టితో ఉన్న సంధాలేమిటో అంతా తెలుసు.
ఆ లింకులన్నీ బయటకు తీస్తున్నాం. నీ సంగతి చూస్తాం. రేపు మీటింగ్ లక్షలాది మంది వస్తున్నారనే ఇంటలిజెన్స్ సమాచారంతో కేటీఆర్ గజగజవణుకుతున్నాడు. లీగల్ నోటీసులతో డ్రామాలాడుతున్నాడు. ఇప్పటికే చాలాసార్లు జైలుకుపోయినం నాకేం కొత్తకాదు' అన్నారు. 'విద్యార్థుల చావులకు, అన్నదాతల ఆత్మహత్యలకు, ఆర్టీసీ కార్మికుల చావులకు మీ అయ్యే కారణం. ఇయ్యి లీగల్ నోటీసులు ఇవ్వాలి' అని కేటీఆర్కు సూచించారు. దళితులకు మూడెకరాలిస్తామని ఇవ్వకపో వడంపై టీఆర్ఎస్ ప్రభుత్వంపైనే 420 కేసు పెట్టాలన్నారు.