Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ భారత ప్రాంతీయ కార్యదర్శికి ఎస్ఎఫ్ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నెట్ పరీక్షను విలీనం చేయడాన్ని కేంద ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాడ్ చేసింది. ఈ మేరకు యూజీసీ దక్షిణ భారత ప్రాంతీయ కార్యదర్శి మనోజ్‌కుమార్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. యూజీసీ నెట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్ష నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని పేర్కొన్నారు. 2020-డిసెంబర్, 2021-జూన్ పరీక్షలను విలీనం చేసి నిర్వహించారని గుర్తు చేశారు. దానివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఒక అవకాశాన్ని కోల్పోయారని తెలిపారు. యూజీసీ నెట్ పరీక్షలో ఆరుశాతం ఫలితాలు ఇస్తారని వివరించారు. రెండు పరీక్షలను విలీనం చేసిన తర్వాత 12 శాతం ఫలితాలు ఇవ్వాల్సి ఉండగా, ఆరు శాతానికే ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.విలీనానికి అనుగుణం గా రిజర్వేషన్లను పెంచకపోవడం వల్ల ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులు జేఆర్ఎఫ్, నెట్ అర్హతను కోల్పోతున్నారని తెలిపారు. దీంతో పరిశోధనలకు దూరమవుతున్నార ని వివరించారు. యూజీసీ తక్షణమే విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అందుకనుగుణంగా12 శాతం రిజర్వే షన్ను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్ గువేరా,అశోక్‌రెడ్డి,ఓయూ కార్యదర్శి రవి, ఉపాధ్య క్షులు అరవింద్,కరణ్, నిజాం కాలేజీ నాయకులు శేఖర్, శ్రీమాన్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.