Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భగీరథపై రూ.6 వేల కోట్లు భారం
- కేంద్ర సాయం చేయకపోగా అదనంగా పన్నులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రభుత్వాల విధానాలు ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలి. అప్పుడే సంక్షేమ రాజ్యంగా భావిస్తారు. కాగా కేంద్ర ప్రభుత్వం పన్నుల విధానం మాత్రం ఇందుకు విభిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు నష్టం చేసేలా ఉంది. శాపంగా మారింది. నిధుల కైంకర్యం చేస్తున్నది. వెరసి చివరకు అది సాధారణ ప్రజల వాతలు పెట్టేలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ తాగునీటి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పోటు తప్పలేదు. భగీరథకు ఖర్చు చేసిన నిధుల్లో దాదాపు 18 శాతం జీఎస్టీ కింద కేంద్ర ప్రభుత్వ ఖజా నాలో జమ పోతున్నది. 2050 సంవ త్సరం వరకు ప్రజల తాగునీటి అవసరాలకు అనుగు ణంగా మిషన్ ప్రాజెక్టును ప్రభుత్వం రూపొందించింది. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సైతం తయారు చేసింది. భగీరథ కోసం రూ.46,123 కోట్లను ప్రతి పాధించింది. బడ్జెట్లోనూ కేటాయిం పులు చేసింది. వాణిజ్య బ్యాంకుల నుంచి నిధులు రుణాల రూపంలో తెచ్చింది. కాగా అంచనాల్లో రూ.34,200 కోట్లు ఖర్చయినట్టు అధికారిక సమాచారం. ఇందులో పాత వ్యాట్, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీఎస్టీ ప్రకారం 18 శాతం పన్ను కట్టాల్సి వచ్చింది. ఆ మేరకు రూ. 6,156 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం ఖాతాలో పడ్డాయి. దీంతో జీఎస్టీ భారం భగీరథపై పడినట్టయింది.
ఏ ఏ పనులు..
భగీరథ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 26 సెగ్మెంట్లల్లో నిర్మించారు. ఇంటేక్ వెల్స్, ట్రీట్మెంట్ ప్లాంట్లు, పంపింగ్ హౌసెస్, సంపులు, ఓహెచ్‌బీఆర్‌లు, సబ్స్టేషన్లు, పైపులైనింగ్ పనులు జరిగాయి. నిధుల ఆదా కోసం ప్రాజెక్టు నీళ్లను దాదాపు 98 శాతం గ్రావిటి ద్వారా తరలించాలని ముందే ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. కేవలల రెండు శాతం ఇండ్లకు మాత్రమే పంపింగ్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
గ్రావిటితో భారీగా మిగులు
కొండలు, గుట్టలపైన నిర్మించిన భారీ ట్యాంకులు, ఇతర కట్టాడాల మూలంగా తాగునీటి సరఫరా సులభమైనట్టు భగీరథ ఇంజినీర్లు చెబుతున్నారు. ఈనేపథ్యంలో గ్రావిటి ద్వారా నీటి సరఫరాతో పైపులైనింగ్ ఎక్కువగా వేయకపోవడం, విద్యుత్ కోసం తక్కువ నిధులే అవసరం కావడంతో మిగులుబాటు వచ్చినట్టు సమాచారం. డీపీఆర్ ప్రకారం మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.46,123 కోట్లు కాగా, ఖర్చయింది మాత్రం రూ.34,200 కోట్లు. ఇందులో రూ.11,923 కోట్లు మిగిలినట్టు తెలిసింది.
అడిగినా సాయం చేయని కేంద్రం
మిషన్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు లేఖలు రాసింది. ముఖ్యమంత్రి, మంత్రులు స్వయానా కలిసి వినతిపత్రాలు ఇచ్చింది. చివరకు నిటిఅయోగ్కు ప్రాజెక్టు నివేదికను సమర్పించింది. ఆ సంస్థ భగీరథ ప్రాజెక్టు నిర్మాణం పట్ల హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది. కేంద్ర మంత్రులు సైతం ఈ పథకానికి జే జే లు పలికారు. భగీరథ మోడల్‌ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు పరిచయం చేసింది. దాదాపు 14 రాష్ట్రాల్లో ఇప్పుడు భగీరథ మోడల్లో తాగునీటి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. అలాగే భగీరథకు రూ. 17 వేల కోట్లు సాయం చేయాలని మోడీ సర్కారుకు సూచించింది కూడా. కాగా, కేంద్ర మాత్రం స్పందించలేదు. ఫైసా సాయం చేయలేదు. అంతేగాక జీఎస్టీ రూపంలో రూ.6,156 కోట్లు కొల్లగొట్టడం ఆందోళనకు గురిచేసే అంశం. ప్రభుత్వం పథకాల పనులకు జీఎస్టీని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లేఖలు రాసినా పట్టించుకోకపోవడం తెలిసిందే.