Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఈడబ్యూఐడీసీ చైర్మెన్ రావుల శ్రీధర్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ వేదికపై ఉన్న బీజేపీ నేతల్లో చాలా మంది ప్రజలు తిరస్కరించిన వారే ఉన్నారని టీఆర్ఎస్నేత, టీఎస్ఈడబ్యూఐడీసీ చైర్మెన్ రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. ముప్పైవేలు కూడా పట్టని స్థలాన్ని నింపడానికి బీజేపీ నేతలు ఆపసోపాలు పడ్డారని ఎద్దేవా చేశారు. బీజేపీ సభను పురస్కరించుకుని శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తుక్కుగూడ సభకు జనం రాకపోవడంతో అమిత్‌షా సైతం ఆలస్యంగా వచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను సాధించలేదని నేతలు...మైక్ దొరికిందని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. సొంత ఊళ్లల్లో వార్డు మెంబర్ కూడా గెలవని నాయకులూ కూడా వేదికపై నుంచి సీఎంను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సొల్లు చెప్పడం కాదు...రాష్ట్రానికి ఏం చేస్తావో చెప్పాలని డిమాండ్ చేశారు.