Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్-2 బీ, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2 పరీక్షల్లో ఎనిమిది మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటన విడుదల చేశారు. పెద్దపల్లిలో ఒకరు, నిజామాబాద్లో ఇద్దరు, నల్లగొండలో ముగ్గురు, వికారాబాద్లో ఇద్దరు చొప్పున మొత్తం ఎనిమిది మంది విద్యార్థులపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 3,35,200 మంది దరఖాస్తు చేయగా, 3,21,264 (95.9 శాతం) మంది హాజరయ్యారని వివరించారు. 13,936 (4.1 శాతం) మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారైనట్టు వివరించారు. పరీక్షా సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా బోర్డు తరఫున పరిశీలకులను నల్లగొండ, మెదక్, జనగామ, సూర్యాపేట జిల్లాలకు పంపించామని తెలిపారు.