Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై దూరదర్శన్ ఛానెల్ ద్వారా విద్యార్థులతో ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ముఖాముఖీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన వెల్లడించారు. పరీక్షలకు ఎలా సిద్ధం కావాలనే అంశంపై పదో తరగతి విద్యార్థులతో పరస్పర సంభాషణ కార్యక్రమం ఉంటుందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు డీఈవోలు, ఎంఈవోలు, ఉపాధ్యా యులు ఈ విషయాన్ని వివిధ రకాల మాధ్యామాల ద్వారా విద్యార్థులకు సమాచారం అందించాలని సూచించారు. ఈనెల 23 నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్న 12.45 గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.
చివరి అరగంటలో బిట్‌పేపర్
పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సమయంలో చివరి అరగంటలో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన బిట్‌పేపర్ ఇస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు.జనరల్ సైన్స్ విద్యార్థులు రెండు పేపర్లు రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ఉదయం9.30నుంచి11.05 గంటల వరకు ఫిజికల్ సైన్స్ రాస్తారని పేర్కొన్నారు.10.35గంటలకు ఫిజికల్ సైన్స్‌కు సంబం ధించిన బిట్‌పేపర్ ఇస్తారని తెలిపారు.ఐదు నిమిషాల తర్వాత అంటే11.10గంటలనుంచి బయలాజికల్ సైన్స్ పేపర్‌ను రాయాలని వివరించారు.12.15గంటలకు దానికి సంబంధించిన బిట్‌పేపర్ ఇస్తారని తెలిపారు.