Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మైనర్ బాలిక కీర్తి హత్యా సంఘటనపై పోలీసులు నిగ్గుతేల్చాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం (టీఆర్వీఎస్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుమ్మడిరా జు నరేష్, పైళ్ల ఆశయ్య శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబా ద్లోని మియాపూర్ సర్కిల్ గూగుల్ ఫ్లాట్ ప్రాంతంలో సాయిసింధు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా జీవనం సాగిస్తున్న శ్రీనివాస్ కూతురు కీర్తి (12 ఏండ్లు) శుక్రవారం అపార్ట్మెంట్ పైకెళ్లి ఆడుకుంటున్న సమయంలో ఆ అమ్మాయిని హత్యచేసి, ఉరివేసుకున్నట్టుగా చిత్రీకరించిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వెంటనే స్పందించి నిజానిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.24 గంటలు గడిచినా నిందితులెవరో తేల్చకపోవడం, పోలీసుల చోద్యం చూస్తుంటే అనేక అనుమానాలు వస్తున్నాయని తెలిపారు.