Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లకు పెంచాలి
- రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఎర్రతోట రాజశేఖర్
హైదరాబాద్: దేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనులలో ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ దళిత్ ఇండిస్టీ జాతీయ కౌన్సిల్ చైర్మెన్ ఎర్రతోట రాజశేఖర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లు సీఎం కేసీఆర్‌కు ఎల్లవేళలా రుణపడి ఉంటారని తెలిపారు. ఈ మేరకు శనివారం దోమలగూడలోని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ దళిత్ ఇండస్ట్రీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రస్తుతం ఉన్న ద్రవ్య పరిమితిని రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లకు పెంచాలని కోరారు. ఆర్థిక వెసులుబాటు కోసం ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 59 రాష్ట్ర పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో మరింత రాయితీలు, సడలింపులను పొడిగించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ విభాగాలలో జీఓను అమలు చేయాలని అన్నారు. బినామీ, నఖిలీ కాంట్రాక్టర్లను తొలగించడానికి నిర్ధిష్ట క్లాజును చేర్చాలన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనులలో రిజర్వేషన్లు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారు నర్రా రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి నీరుడి రాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కంపా తిరుపతయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అద్దుల లక్ష్మణ్, యాచారం కృష్ణ, వాసు, శ్రీనివాస్ పుట్ట తదితరులు పాల్గొన్నారు.