Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అమిత్ షా అబద్ధాల షాగా మారారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు విమర్శించారు. దమ్ముంటే షా తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు టీఆర్ఎస్ మద్దతిచ్చిన మాట వాస్తవం కాదా? మిషన్ భగీరథ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నది నిజం కాదా? రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలులో రూ.850 కోట్లు ఖర్చు కాగా, అందులో కేంద్రం ఇచ్చిన వాటా రూ.150 కోట్లు మాత్రమేనని తెలిపారు. నిటిఅయోగ్ సూచిలో రాష్ట్రం మూడో స్థానంలో ఉండగా, యూపీ చివరి స్థానంలో ఉందని తెలిపారు. సర్వశిక్ష అభియాన్ అమలు కోసం రాష్ట్రం రూ.7,000 ఖర్చు చేయగా, కేంద్రం రూ.300 కోట్లు మాత్రమే ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రానికి నరేగా కింద రూ.30 వేల కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబితే, అమిత్ షా రూ.18 వేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారనీ, ఇందులో ఏది నిజమని ప్రశ్నించారు. బీజేపీకి నైతికత లేదని విమర్శించారు.