Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉత్పత్తి కులాలైన వృత్తి కలాలన్నీ ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం ఆవిష్కృతమవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జ్వలిత సంపాదకత్వం వహించిన 'మల్లెసాల' మహా గ్రంధాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారి జీవనవృత్తి కథలన్నీ ఉధృతంగా వస్తున్నాయని చెప్పారు. శతాధిక చేతివృత్తుల కథ సంకలనం తెచ్చిన జ్వలితను ఆయన అభినందించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో వర్గం, కులం ఈ రెండింటికి సంబంధించిన సాహిత్యం విరివిగా వచ్చిందని గుర్తు చేశారు. బహుజన కులాల నుంచి వచ్చిన సాహిత్యం తెలుగు సాహిత్యంలో విప్లవాలను సృష్టించిందన్నారు. తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఆకుల లలిత మాట్లాడుతూ జ్వలిత వెలువరించిన స్త్రీవాద కవిత్వం సంఘటిత గ్రంధం ఎంతో విలువైనదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర ఎస్ రఘు అధ్యక్షతన వహించన సభలో ప్రముఖ రయిత్రి గొగు శ్యామల, అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, బీసీ కమిషన్ చైర్మెన్ బిఎస్ రాములు, తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నస్రీన్ ఖాన్ తదితరులు మాట్లాడారు.