Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాల్యుయేషన్ రెమ్యునరేషన్ పెంచినందుకు ధన్యవాదాలు
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమకు దగ్గరగా ఉన్న ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులో అధ్యాపకులు చేరేందుకు విద్యాశాఖ అనుమతులివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంటాక్ట్ లెక్చరర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ కోరారు. వాల్యుయేషన్ రెమ్యునరేషన్ పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం వారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్‌బోర్డు కార్యదర్శికి ఆన్లైన్లో వినతిపత్రాన్ని పంపారు. ఇంటర్ బోర్డు పరీక్ష పేపర్ మూల్యాంకనాన్ని చేపట్టేందుకు 14 కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. మే చివరి వారం నుంచి జూన్ వరకు మూల్యాంకనము చేసి పరీక్ష ఫలితాలు ప్రకటించి, జూలైలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ప్రయత్నాలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఇంటర్ విద్యలో పనిచేసే సిబ్బందికి ఈ ఏడాది సెలవులు ఇవ్వలేదనీ, మూల్యాంకనం వల్ల కనీసం కుటుంబ సభ్యులను కూడా కలుసుకునే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో అధ్యాపకులకు అందుబాటులో ఉన్న కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.