Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవకాశం ఇవ్వండి
- ఇంటర్‌బోర్డుకు టీఎస్‌జీసీసీఎల్‌ఏ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్‌లో అధ్యాపకులు అందుబాటులో ఉన్న క్యాంపుల్లో చేరే అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంటాక్ట్ లెక్చరర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు విద్యాశాఖ మంత్రి, ఇంటర్ బోర్డు సెక్రటరీకి ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపారు. ఈ ఏడాది దాదాపు తొమ్మిది లక్షలమందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారనీ, రాష్ట్రవ్యాప్తంగా 14 మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అధ్యాపకులు కుటుంబాలకు దూరంగా మూల్యాంకనాల్లో పాల్గొనడం కష్టంగా ఉంటుందనీ, అందువల్ల దగ్గర్లోఉన్న కేంద్రాల్లో బాధ్యతలు స్వీకరించేలా అవకాశం కల్పించాలని కోరారు.