Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఐటీ రంగాన్ని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయబోమనీ, రాష్ట్రంలోని టైర్-2 సిటీల్లోకీ విస్తరిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఐటీ రంగంలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడటం కాదనీ, సింగపూర్, మలేషియా వంటి దేశాలతో పోటీ పడాలని చెప్పారు. సోమవారంనాడాయన హైదరాబాద్ రాయదుర్గంలోని మైహౌమ్ ట్విట్జాలో ష్యూరిఫై ల్యాబ్స్ టెక్నాలజీ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీని విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఐటీ కంపెనీల్లో స్వదేశీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఐటీ విస్తరణకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఐటీ రంగంలో అభివృద్ధి మంత్రి కేటీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. త్వరలో రాష్ట్రంలోని ప్రధాన నగరాలకూ ఐటీ విస్తరణ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, సైయింట్ వ్యవస్థాపక చైర్మెన్, బోర్డ్ సభ్యులు డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ష్యూరిఫై ల్యాబ్స్ సీఈఓ డస్టిన్ యోడర్ తదితరులు పాల్గొన్నారు.