Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో మహిళల రక్షణకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎక్కడ, ఎలాంటి వేధింపులు ఎదురైనా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ, దానికోసం అనేక మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు. ట్రూ కాలర్, నెట్వర్క్-18 ఆధ్వర్యంలో ''సామాజిక మాధ్యమాల్లో మహిళల వేధింపులపై గళమెత్తడం'' అంశంపై జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. దీనికామె ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి కోసం బీడీలు చుడుతున్న మహిళలు, ల్యాప్‌టాప్‌లో పనిచేసే రోజులు రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ మహిళల పేరుమీదే జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల మహిళా జూనియర్ లైన్ ఉమెన్ నియామకం జరగడాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఇంటర్నెట్ మరింతగా అందుబాటులోకి వస్తే ఆర్థిక అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. మహిళలకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురైతే, వాటిని తొలగించకుండా, ఆధారాలతో ఫిర్యాదు చేయాలనీ, అప్పుడే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమానికి జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ ఎడిటర్ మార్యా షకీల్ సమన్వయకర్తగా వ్యవహరించారు.