Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నైరుతి రుతుపవనాలు దక్షిణబంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో చాలా భాగానికి సోమవారం విస్తరించాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. తదుపరి రెండు, మూడు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతా ల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రాబోయే ఐదు రోజులలో అండమాన్, నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉంది. రాబోయే రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగ రత్న తెలిపారు. సోమవారం నాడు 18 చోట్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 2.68 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల మేర పడిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో అత్యధికంగా 42.8 డిగ్రీలు, మహబూబాబాబాద్ జిల్లా గార్ల మండలంలో 42.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.