Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిగ్రీ కాలేజీలు, కోర్సులను రద్దు చేస్తాం
- ఏ డిగ్రీ చదివినా..ఆర్ట్స్, సోషల్‌సైన్సెస్ పీజీ కోర్సులు చేసే అవకాశం
- మీడియాతో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మూడేండ్లు జీరో అడ్మిషన్ ఉన్న డిగ్రీ కాలేజీలను, ఒక్కరు కూడా చేరని కోర్సుల అనుమతులను రద్దు చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కామన్ పీజీ ఎంట్రన్స్‌లో మార్పులు.. ఏ డిగ్రీ చేసిన ఆర్ట్స్ , సోషల్ సైన్సెస్ పీజీ కోర్సు లు చేసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అన్ని కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు న్యాక్ అక్రిడేషన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే కాలేజీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపారు. ఈ నెల 20న డిగ్రీ కాలేజీలకు న్యాక్ గుర్తింపు పై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. డిగ్రీ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫారిన్ లాంగ్వేజెస్ కోర్సులను అనుమతిస్తామని ప్రకటించారు.