Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు జిల్లాల్లో భారీ వర్షం...నేలవాలిన పంట
నవతెలంగాణ- విలేకరులు
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం అర్థరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజా ము వరకు పలు చోట్ల భారీవర్షం కురిసింది. దాంతో కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిచి ముద్దయింది. రోడ్లెంబడి ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. దాంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల దాటికి కోత కోయని పంట నేలవాలింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్, లింగంపేట్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపించాయి. భిక్కనూర్, నాగిరెడ్డిపేట్, మాక్లూర్ తదితర ప్రాంతాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. తడిచిన ధాన్యం సైతం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, నష్టపోయిన వారిని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షానికి కొన్ని చోట్ల పంట నష్టం జరిగింది. మరికొన్ని చోట్ల వరిధాన్యం తడిసిముద్దగా మారింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో పంట వర్షార్పణమైంది. నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఐకేపీ సెంటర్లో నిల్వ ఉంచిన వరి ధాన్యం సుమారు 50క్వింటాళ్లు కాల్వలో కొట్టుకుపోయింది. జన్నారం మండలం బాదంపల్లిలో పొలంలో ఆరబోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయి.జన్నారంలో రెండు ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. లక్షెట్టిపేట మండలం కొమ్ముగూడెంలో ఈదురుగాలుల ప్రభావానికి రైతువేది క భవనం పైకప్పు రేకులు లేచిపోయాయి. ఖానాపూర్లో వరి పంట నేలకొరి గింది.పలువురి ఇండ్లు కూలిపోయాయి. కొన్నిచోట్ల చెట్లు నేలకూలాయి.