Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
వేసవికాలంలో గ్రామాల్లో తాగునీటి సరాఫరా సంతప్తికరంగా జరుగుతున్నదని మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ జి. కృపాకర్రెడి అన్నారు. వర్షాకాలం ప్రారంభయ్యేవరకు ఇదే ఉత్సాహంతో పనిచేయాలని ఇంజినీర్లు, అధికారులకు సూచించారు. తాగునీటి సరాఫరాపై అన్ని జిల్లాల ఎస్ఈ, ఈఈ, డీఈఈలతో హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లోని మిషన్‌భగీరథ ప్రధాన కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి సరాఫరాలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని అధికారులను కృపాకర్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలంతా మిషన్ భగీరథ నీటినే తాగేలా గ్రామాల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఆర్ఓ ప్లాంట్ నీళ్లు తాగితే కలిగే దుష్పరిణామాలపై ప్రజలను చైతన్యపరచాలని చెప్పారు. మిషన్ భగీరథ నీటి నాణ్యత, స్వఛ్చతను ప్రజలకు వివరిస్తే మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. త్వరలో ప్రారంభమయ్యే పల్లెప్రగతి కార్యక్రమంలో భగీరథ అధికారులు యాక్టీవ్‌గా పాల్గొనాలని కోరారు. మిషన్ భగీరథ నిర్మాణాలు, ప్లాంట్ల దగ్గర ఈ వర్షాకాలంలో 3,50,000 మొక్కలు నాటాలని భగీరథ అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజినీర్లు విజరు ప్రకాశ్, వినోభాదేవి, చెన్నారెడ్డి, శ్రీనివాస్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.