Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర కార్యదర్శి డీజీ నర్సింహారావు
- మహబూబాబాద్ మున్సిపల్ ఆఫీస్ ముందు భారీ ధర్నా
నవతెలంగాణ- మహబూబాబాద్
'తెలంగాణ రాష్ట్రము వచ్చింది కానీ ఆశలు ఏ మాత్రం నెరవేరలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఎలాంటి ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదు. పైగా ప్రజలపై అనేక ఆర్థిక భారాలు పడుతున్నాయి. కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు నిత్యావసర వస్తువుల ధరలు,, ఇలా ఎన్నడూ లేని విధంగా పేద, మధ్యతరగతి ప్రజలను కోలుకోలేని దెబ్బ కొట్టింది' అని టీఎస్ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర కార్యదర్శి డిజి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పట్టణంలో సోమవారం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఆఫీస్ ముందు భారీ ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి డిజి నరసింహారావు మాట్లాడారు. ఎన్నికల ముందు దళిత గిరిజనులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన. ప్రభుత్వ విద్యను, వైద్యాన్ని బలోపేతం చేయడం, 57 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్ ఇలాంటి వాగ్దానాలు వాగ్దానం లాగానే మిగిలిపోయాయని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పట్టణ అభివృద్ధి సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాల్టీలలో సమస్యలపై సర్వేలు నిర్వహించిందని, ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారో తెలుసుకుని వాటిని వినతిపత్రం రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ మహబూబాబాద్ పట్టణంలో 36 మున్సిపల్ వార్డులలో 25 బృందాలుగా ప్రజాసంఘాలు ఏర్పడి వార్డుల్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేయడం జరిగిందన్నారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకోసం 4,500 మంది దరఖాస్తు పెట్టుకుంటే ఒక్కరి కంటే ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. పూర్తి అయిన రెండు వందల ఇండ్లు అర్హులైన పేదలకు ఇవ్వకుండా ప్రజా ప్రతినిధులు మధ్య దళారులు బేరాలు మాట్లాడుకుని లక్ష నుంచి రెండు లక్షల వరకు తీసుకున్నట్టుగా సర్వే బృందాలకు చెప్పారని వివరించారు. 59 జిఓ పేరుతో మహబూబాబాద్ పట్టణ ప్రజలతో వందల కోట్ల రూపాయలు కట్టించుకుని ఒక్క పట్టా కూడా ఇవ్వలేదన్నారు. అదేవిధంగా ఇల్లు లేని ప్రజలకు ఇండ్ల స్థలాలు ప్రభుత్వం ఇచ్చి 10 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దళిత బంధు ప్రతి పేద దళిత కుటుంబానికి ఇవ్వాలని కోరారు పెన్షన్లు రేషన్ కార్డులు మరుగుదొడ్లు పేదల కట్టుకున్న ఇల్లు పట్టాలు ఇచ్చి ఇంటి నెంబర్లు వేయాలని. ధరణి లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కోతుల బెడద ను నివారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవీపీఎస్ నాయకులు సూర్నపు సోమయ్య. పట్టణ అభివృద్ధి సంఘం నాయకులు సమ్మెట రాజమౌళి, మహిళా సంఘం నాయకులు గాడి పెళ్లిప్రమీల, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కుర్ర మహేష్. గిరిజన సంఘం నాయకులు భానోత్ సీతారాం. సీఐటియూ పట్టణ కన్వీనర్ కుమ్మరి కుంట నాగన్న. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హేమ నాయక్. డివైఎఫ్ఐ నాయకులు రావుల రాజు. మహిళా సంఘం పట్టణ అధ్యక్ష కార్య దర్శలు చాగంటి భాగ్యమ్మ. సూర్నాపు సావిత్ర. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గౌని వెంకన్న. తదితరులు పాల్గొన్నారు.