Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రకమిటి సభ్యులుగా కోట రమేష్ ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డీవైఎఫ్ఐ అఖిల భారత కార్యదర్శి వర్గ సభ్యులుగా ఆనగంటి వెంకటేశ్, కేంద్ర కమిటి సభ్యులుగా కోట రమేష్ ఎన్నికయ్యారు. ఈ నెల12 నుంచి 15 వరకు కలకత్తాలో జరిగిన డీవైఎఫ్ఐ 11 వ అఖిల భారత మహసభలో తెలంగాణ రాష్ట్రం నుంచి వీరు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగం,మతోన్మాదానికి వ్యతిరేకంగా రానున్న కాలంలో యువజన సమస్యల పరిష్కారానికై ఉద్యమాలు నిర్వహించున్నునట్టు తెలిపారు.వీటితోపాటు స్థానిక సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థాయి నుంచి పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మహసభలో 25 తీర్మానాలను ఆమోదించినట్టు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని వాగ్దానం చేసి ఎనిమిదేండ్లు అవుతున్నదని గుర్తుచేశారు. ఇచ్చిన హమీ ప్రకారం ఇప్పటి వరకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా ఏ ఒక్కరికీ ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగ యువతను మోసం చేశారని విమర్శించారు.