Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ హామీ
- దశల వారీగా దళితబంధు
- అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగాణాలు నిర్మిస్తామని వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇటీవల అకాల వర్షాల వల్ల తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటామని సీఎం కేసీఆర్ హామీనిచ్చారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసానిచ్చారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్య ంలో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా వరిధాన్యం సేకరణపై సీఎం ఆరా తీశారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతి తదితరాంశాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నా మనీ, ఇప్పటి వరకూ 20 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించామని వారు తెలిపారు. అకాలవర్షాల వల్ల అక్కడక్కడా వరిధాన్యం తడు స్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ, తడిసిన ధాన్యాన్ని ఎంత ఖర్చైనా భరించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. కేంద్రం కొన్నా, కొనకున్నా బాయిల్డ్ రైస్‌ను ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. ఈ యేడాది నియోజకవర్గానికి 1500 మంది చొప్పున దళితబంధు పథకానికి లబ్దిదారుల ను ఎంపిక చేసే ప్రక్రియను కొనసాగించాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత దశలవారీగా పథకాన్ని అమలు చేయాలని సూచించారు. దాని అమల్లో మరింత వేగం పెంచాలని కోరారు. భవిష్యత్ తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు వీలుగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో 'తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను' ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19వేల గ్రామాలు, 5 వేల వార్డుల్లో కలిపి మొత్తంగా 24 వేల 'గ్రామీణ క్రీడా కమీటీల'ను ఏర్పాటు చేయాలన్నారు.
గ్రామాల్లో క్రీడలను నిర్వహిం చటం కోసం ఈ కమిటీలు పనిచేస్తాయని ఆయన తెలిపారు. రాష్ట్ర అవిర్భావ దినోత్సవం(జూన్ 2) సందర్భంగా ఎంపిక చేసిన కొన్ని గ్రామల్లో ఇలాంటి ప్రాంగణాలను ప్రారంభించాలని ఆదేశించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున జూన్2న రాష్ట్ర అవతరణ వేడుకలను ఉదయం తొమ్మిది గంటలకే ప్రారంభించాలని అధికారులు, మంత్రులకు సూచించారు.