Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజామాబాద్ జిల్లాలో విత్తనాల కోసం
నవతెలంగాణ-డిచ్పల్లి
జిలుగ విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్పల్లి సొసైటీ పరిధిలో ఘన్పూర్లో జీలుగ విత్తనాల బ్యాగులకు బుధవారం పంపిణీ చేశారు. 30 కిలోల బస్తా ధర రూ.1897.50 ఉండగా.. ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు రూ. 664.20కే అందజేస్తుంది. పంపిణీ ప్రారంభించిన విషయం తెలియగానే రైతులు ఒక్కసారిగా సొసైటీకి తరలివచ్చారు. బస్తాలు అందుతాయోలేదోనని బారులు తీరారు. సొసైటీకి 833 బస్తాలు వచ్చినట్టు వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు తెలిపారు. జీలుగ విత్తనాల కొరత లేదని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. రైతులందరికీ సరిపడా సరఫరా చేస్తామని తెలిపారు. డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి, రాంపూర్ డి, బర్దిపూర్ సొసైటీల్లో సైతం పంపిణీ ప్రారంభించగా, రైతులు క్యూ కట్టారు.