Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ నుంచి పెద్దల సభకు దామోదర్‌రావు.. పార్థసారధి రెడ్డి, రవిచంద్ర
- బి-ఫాంలు అందజేసిన సీఎం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజ్యసభ సీటును ఆశించిన సీనియర్లకు, ఆశావహుల జాబితాలో ఉన్న జూనియర్లకు సీఎం కేసీఆర్ షాక్‌నిచ్చారు. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన ఆయన గురువారం అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. తొలి నుంచీ ప్రచారంలో ఉన్న నమస్తే తెలంగా ణ ఎమ్డీ దీవకొండ దామోదర్‌రావుతోపాటు హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారధి రెడ్డి, బీసీ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)ని పెద్దల సభకు ఎంపిక చేశారు.ఆ ముగ్గురిలో ఇద్దరు ఖమ్మం జిల్లాకు చెందినవారే కావడం విశేషం.రాజ్యసభ ఎంపీగా ఇంకా రెండున్నరేండ్ల పదవీకాలం ఉండగానే బండ ప్రకాశ్ చేత సీఎం రాజీనామా చేయించారు. ఆయన కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
బండ ప్రకాశ్ రాజీనామా నేపథ్యం లో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.దీనికి నేటితో (శుక్రవారం) నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో రాజ్యసభ అభ్యర్థులను కేసీఆర్ ఫైనల్ చేశారు. బండ ప్రకాశ్ స్థానంలో ఖాళీ అయిన స్థానానికి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న డీ.శ్రీనివాస్ (డీఎస్), కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీకాలం వచ్చే నెలలో ముగియనుంది. ఆ స్థానాల్లోనూ ఎన్నికల నిర్వహణకు సైతం ఈసీ ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 24 నుంచి 31 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువుంది. దీంతో ఆయా స్థానాలకు పార్థసారధి రెడ్డి, దామోదర్రావులను సీఎం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో దామోదర్‌రావు, డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర గురువారం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. రాజ్యసభకు అవకాశం కల్పించినందుకు వారు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేసీఆర్ వారికి బి ఫాంలను అందజేశారు.