Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
- రాజకీయాలకతీతంగా పోరాడాలని పిలుపు
నవతెలంగాణ-ముషీరాబాద్
సహకార బ్యాంకులను ప్రయివేటుపరం చేయాలన్న ఆలోచన మానుకోవాలని వక్తలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలని కోరారు. సహకార ధర్మపీఠం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సహకార బ్యాంకుల రక్షణపై ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆలిండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రయివేటు అప్పులు రైతులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పారు. వారికి ఎంతో ఉపయోగంగా ఉన్న సహకార బ్యాంకులను ప్రయివేటుపరం చేయాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కిసాన్‌సెల్ వైస్ చైర్మెన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. సహకార బ్యాంకులపై ఆంక్షలు విధించి, సహకార వ్యవస్థను ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురా వడం ఆందోళన కలిగిస్తోందన్నారు. దీనిపై రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ మాట్లాడుతూ.. సహకార వ్యవస్థను ప్రయివేటీకరించ డమంటే గ్రామీణ ప్రజలను, రైతులను ప్రయివేటు బ్యాంకులకు బానిసలుగా మార్చడమేనని చెప్పారు.
కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యం తో నిర్వహించే సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. రైతుల ప్రయోజనా లను దృష్టిలో పెట్టుకుని సహకార విధానాన్ని కొనసాగించా లన్నారు. ఈ కార్యక్రమంలో కో- ఆపరేటివ్ యూనియన్ నాయకులు శశి మోహన్, తెలంగాణ కో- ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ మోహనయ్య, సహకార ధర్మ పీఠం ధర్మకర్త సాంబారపు భూమయ్య తదితరులు పాల్గొన్నారు.