Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు హరీశ్‌రావు ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలనీ, పాత వారికి ఇబ్బంది లేకుండా కొత్త సభ్యత్వం ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్నదని చెప్పారు. ఈ లెక్కన కొత్తగా సొసైటీలు ఏర్పాటుచేయడంతోపాటు, పాత సొసైటీల్లోనూ ఎకరానికి ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాల్సి ఉందన్నారు. దీనివల్ల పాత సొసైటీల్లోన్లూ కొత్తగా సభ్యులను ఎంపిక చేయుచ్చని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఇదే అంశంపై ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో 281 సొసైటీలు ఉండగా అందులో 20,731 మందికి సభ్యత్వం ఉందన్నారు. ప్రస్తుతం ఈ సొసైటీలు జిల్లాలోని 1,255 నీటి వనరులను వినియోగించుకుంటున్నాయని చెప్పారు. ఇంకా 381 నీటి వనరులకు సొసైటీలు ఏర్పాటుచేయాల్సి ఉందన్నారు. మెదక్ జిల్లాలో 263 సొసైటీల్లో 15,724 మంది సభ్యులు ఉన్నారనీ, ఈ సొసైటీలు జిల్లాలోని 1,379 నీటి వనరులను వినియోగించుకుంటున్నాయని చెప్పారు. ఇంకా 235 నీటి వనరులకు కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 193 సొసైటీల్లో 10,434 మంది సభ్యులు ఉన్నారనీ, అవి 875 నీటి వనరులను వినియోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇంకా 196 నీటి వనరులకు సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, క్రాంతి కిరణ్, మదన్‌రెడ్డి, మాణిక్‌రావు, ఎమ్మెల్సీలు యాదవ్రెడ్డి, పారూఖ్ హుస్సెన్, భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్యా, అధికారులు పాల్గొన్నారు.