Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగాల సాధన కోసం ఏకాగ్రతతో చదివితే సక్సెస్ సాధిస్తారని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. లక్ష్యాన్ని ఎంచుకుని సరైన పద్దతిలో సబ్జెక్ట్‌పై పట్టు సాధిస్తే విజయాలు వాటంతటవే వస్తాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో అభ్యర్థులకు సలహాలు-సూచన లు అందించేందుకు టి-సాట్ నెట్వర్క్ ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జోన్ల విభజన వలన స్థానిక కోటా పెరిగి ఉద్యోగాలకు సివిల్స్ ఉద్యోగాల్లో ఒక ఉద్యోగానికి లక్ష మంది పోటీ పడుతుండగా,రాష్ట్రంలో విడుదల చేసిన భారీ ఉద్యోగాల నొటిఫికేషన్ కారణం గా 95శాతం స్థానికులకే అనే నిబంధనతో ఒక పోస్టుకు 10మంది మాత్రమే పోటీ పడే అవకాశం ఉందనీ, నియామకాలలో ఇంటర్వూను తొలగించడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక నిర్ణయమన్నారు. తెలంగాణలోని ఆయా జిల్లాల్లో 11 బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగా లకు పోటీ పడే సుమారు 6,500 మందికి ప్రత్యక్ష్య బోధన చేస్తున్నామని తెలిపారు.