Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్.బాలగోపాల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేరళకు సిల్వర్ లైన్ ప్రాజెక్టు అవసరమని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.ఎన్.బాలగోపాల్ తెలిపారు. తెలంగాణలో కమ్యూనిస్టు అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా స్మారకోపన్యాసం ఇవ్వటానికి హైదరాబాద్ విచ్చేసిన ఆయన గురువారం తెలంగాణ మలయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణలో స్థిరపడిన మలయాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. కేరళలో ప్రతిపక్ష పార్టీ సిల్వర్ లైన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన అర్థరహితమని కొట్టిపారేశారు. కేంద్రం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే కేరళ ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రయాణ సమయం నాలుగు గంటలు సరిపోతుందని తెలిపారు.