Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర వ్యవహారంగా పేర్కొంటూ తప్పుపట్టడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తి మేరకే కేంద్రప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులిస్తూ లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. గురువారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాయలంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ గ్రామ పంచాయతీల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రోత్సాహక నిధులివ్వకుండా ఏండ్ల తరబడి జాప్యం చేస్తున్నది కేసీఆర్ కాదా? అని నిలదీశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలనీ, లేదంటే రాష్ట్ర ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.